‘బన్నీ – అట్లీ’ సినిమాలో క్రేజీ కాంబినేషన్‌?

‘బన్నీ – అట్లీ’ సినిమాలో క్రేజీ కాంబినేషన్‌?

‘హీరో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారని టాక్ నడిచింది. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను కూడా తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుండి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

editor

Related Articles