బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సికందర్’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చాలా రోజుల తర్వాత ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో ట్రైన్ సీక్వెన్స్‌లకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా సికిందర్ సినిమాలో మరోసారి అలాంటి మేనియా క్రియేట్ చేయబోతున్నాడు సల్మాన్. తాజా సమాచారం ప్రకారం ముంబైలో సికిందర్ షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ మంగళవారం మొదలు కాగా ఐకానిక్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్‌ఖాన్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే ఈ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతోందని టాక్. సికిందర్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. డైరెక్టర్ మురుగదాస్ ఓ వైపు ఎమోషన్స్‌ను హైలెట్ చేస్తూనే.. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.

- November 28, 2024
0
48
Less than a minute
You can share this post!
editor