కట్ చెప్పినా ఆగకుండా ముద్దులు.. నటి షాకింగ్ కామెంట్స్

కట్ చెప్పినా ఆగకుండా ముద్దులు.. నటి షాకింగ్ కామెంట్స్

నటి సయానీ గుప్తా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ భామకి సరైన గుర్తింపు లభించలేదు. ఇక ఆమె చేసిన ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్ సిరీస్‌లో ఎంత రెచ్చిపోయి నటించిందో చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బోల్డ్ బ్యూటీ. ఆన్ స్క్రీన్‌లో ఈ భామ చిట్టి పొట్టి డ్రెస్సులు, లిప్‌లాక్ సీన్స్‌లో ఇరగదీస్తుంటుంది. ఇలాంటి సీన్స్ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. శృంగారం గురించి నేను ఒక బుక్ రాయగలను. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చెయ్యడం చాలా సులువు. కానీ ఒకసారి మాత్రం నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ షూటింగ్‌లో బోల్డ్ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కట్ చెప్పినా కూడా అందులోని హీరో ఆగలేదు. అలాగే ముద్దులు పెట్టాడని తెలిపింది. అంతే కాదు.. ఆ నటుడి ప్రవర్తన ఏమాత్రం బాలేదని తెలిపింది. కొందరు దీన్ని చిన్న విషయంగా అనుకోవచ్చు కానీ అలా చెయ్యడం కరెక్ట్ కాదంటూ తెలిపింది నటి సయాని గుప్త. అలాగే కొందరు మాత్రం నటీనటుల సేఫ్టీ గురించి అసలు పట్టించుకోరని చెప్పింది.

editor

Related Articles