బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. లండన్‌లో ఓ యువతితో కలిసి కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆయన డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. లండన్‌లోని ఓ క్యాసినో నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆర్యన్ ఖాన్‌తో పాటు ఓ యువతి కెమెరాలకు చిక్కారు. ఇద్దరూ బ్లాక్ కలర్ దుస్తుల్లో కనిపించడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. తొలుత ఆమె ఎవరో తెలియకపోయినా, నెటిజన్లు ఆమెను ప్రముఖ సింగర్ -సాంగ్‌రైటర్ విన్నీ తకైర్గా గుర్తించారు.
ఇదే సమయంలో విన్నీ తకైర్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో లండన్ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఆర్యన్, విన్నీ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండటం, కామన్ ఫ్రెండ్స్ ఉండటం కూడా చర్చకు కారణమైంది. అయితే వీరిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలుగానే ఉన్నాయి. విన్నీ తకైర్ సింగర్, సాంగ్రైటర్గా గుర్తింపు పొందారు. ‘Shining Lights’, ‘Maybe I Love You’, ‘Tro Mig’ వంటి ఒరిజినల్ పాటలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

