“స్లమ్ డాగ్ మిలియనీర్” సీక్వెల్ హక్కులను నిర్మాణ సంస్థ “బ్రిడ్జ్ 7” పొందిందని హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. ఈ క్రమంలో చిత్రబృందం ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ,” ప్రేక్షకులు ఏళ్ల తరబడి మర్చిపోలేని కథలు కొన్ని ఉంటాయి. అలాంటి కథల్లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఒకటి. బలీయమైన కథనం భాషా హద్దులు దాటుతుందని ఈ చిత్రం నిరూపించింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ప్రఖ్యాత డానీ బోయెల్ దర్శకత్వం వహించిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ 2008లో సంచలనం సృష్టించింది. ముంబై మురికివాడల్లోని యువకుల జీవితాలను, వారి ప్రతిభను అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ప్రసిద్ధ క్విజ్ షో కౌన్ బనేగాలో అలాంటి నేపధ్యంలో పుట్టి తన ప్రతిభను పెంపొందించుకున్న ఓ యువకుడు కోటీశ్వరుడయ్యాడు. రెండు కోట్లు ఎలా సంపాదించాడన్నదే ఈ సినిమా కథ. ప్రపంచవ్యాప్తంగా సినీ తారల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, నాలుగు గోల్డెన్ గ్లోబ్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఎనిమిది విభాగాలలో బహుమతులు గెలుచుకుంది మరియు పది విభాగాలలో ఆస్కార్ కు నామినేట్ అయింది.