కిషోర్ దర్శకత్వంలో హీరో రవితేజ?

కిషోర్ దర్శకత్వంలో హీరో రవితేజ?

ప్రస్తుతం మాస్ జాతర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రవితేజ. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న ఈ సినిమా ద్వారా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. సినిమాను మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవితేజ చేయబోయే సినిమాల లిస్ట్‌లో ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్టు తెలుస్తోంది. రామ్‌తో నేను శైలజ, సాయిదుర్గతేజ్‌తో చిత్రలహరి సినిమాలను తెరకెక్కించి, విజయాలను అందుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించనున్నారట. ఇటీవలే రవితేజకు కిషోర్ ఓ ఆసక్తికరమైన కథను వినిపించారట. రవితేజకు కూడా ఆ కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ వేసవి నుండే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్.

editor

Related Articles