నీట్ పేపర్ లీక్‌పై సినిమా

నీట్ పేపర్ లీక్‌పై సినిమా

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీక్ ఉద్యమం వెండితెరపైకి రానుంది. ఈ విద్యార్థి ఉద్యమం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందనున్న చిత్రానికి ‘ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ’ (The Accidental Cockroach Party) అనే టైటిల్‌ను అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు సమాచారం.
జైపూర్‌కు చెందిన గోవింద్ దేవ్ పరిశోధన, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన అనంతరం ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విద్యార్థుల ఉద్యమం, దాని వెనుక జరిగిన పరిణామాలు, ఇప్పటివరకు బయటకు రాని కొన్ని అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కోణంతో పాటు విద్యార్థుల ఐక్యత, ఉద్యమం సాగిన విధానాన్ని కూడా సినిమాలో ప్రధానంగా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక తుది దశలో ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. షూటింగ్ లొకేషన్ల ఎంపిక కూడా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

Related Articles