17 ఏళ్ల కెరీర్.. శృతి చెప్పిన జీవిత పాఠం

17 ఏళ్ల కెరీర్.. శృతి చెప్పిన జీవిత పాఠం

నటి శృతిహాసన్ తన 17 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009లో విడుదలైన ‘లక్’ హిందీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నటిగానే కాకుండా గాయనీ, సంగీత దర్శకురాలిగానూ రాణిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ.. ఈ 17 ఏళ్ల ప్రయాణం తన గురించి, తన వృత్తి గురించి, మనుషుల గురించి ఎంతో నేర్పించిందన్నారు. ఒక సినిమా విజయం లేదా పరాజయం మాత్రమే ముఖ్యమేమీ కాదని, దాని వెనుక పెద్ద బృందం సమష్టి కృషి ఉంటుందనే విషయాన్ని ఈ ప్రయాణం అర్థమయ్యేలా చేసిందని చెప్పారు.

అంతేకాదు, ఈ అనుభవం తనను మరింత మానసికంగా దృఢంగా మార్చిందన్నారు. విమర్శలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే పరిపక్వతను కల్పించిందని పేర్కొన్నారు. కాగా, శృతిహాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి నటించిన తమిళ చిత్రం ‘ట్రైన్’ విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles