ముగ్గురు హీరోలతో నటించలేకపోయా: శ్రీకాంత్

ముగ్గురు హీరోలతో నటించలేకపోయా: శ్రీకాంత్

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌లోని అనుభవాలు, స్టార్ హీరోలతో పనిచేసిన సందర్భాల గురించి మాట్లాడారు. హీరోగా మంచి గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల్లో నటించడం ఆనందంగా ఉందన్నారు. హీరోగా పోటీలో ఉండటం కంటే విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని, అదే తనకు ఎక్కువ సంతృప్తినిస్తోందని చెప్పారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో తమను ఎప్పుడూ పోల్చుకోలేదని, తమకంటూ ప్రత్యేకమైన ఫ్యామిలీ సినిమాల జోనర్ ఉండేదని గుర్తు చేసుకున్నారు. డేట్లు సర్దుబాటు కాక కొన్ని మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని, అందులో ఒక సినిమా పెద్ద విజయాన్ని సాధించిందన్నారు.

అలాగే తన కెరీర్‌లో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మినహా దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఆ ముగ్గురితో కూడా కలిసి నటించే అవకాశం వస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా పాత్రలను ఆదరిస్తున్న నేపథ్యంలో వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నానని శ్రీకాంత్ వెల్లడించారు.

Related Articles