రామ్‌చరణ్‌తో జోడీ కట్టనున్న రష్మిక?

రామ్‌చరణ్‌తో జోడీ కట్టనున్న రష్మిక?

హీరోయిన్ రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ‘ఛావా’ సినిమాలో రష్మిక అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న తాజాగా తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌కు అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్‌. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌పై దృష్టి పెట్టారు దర్శకుడు సుకుమార్‌. గ్లోబల్‌ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది.

editor

Related Articles