రీతూ వర్మ కథానాయికగా సందీప్‌కిషన్ సరసన నటించిన సినిమా ‘మజాకా’. త్రినాథరావు దర్శకుడు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరోయిన్ రీతూవర్మ పాత్రికేయులతో ముచ్చటించింది. ‘మజాకా’ సినిమాలో కావాల్సినంత వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను కాలేజీ అమ్మాయి పాత్రలో కనిపిస్తా. చిన్నతనంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఆమె వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? హీరోతో తన బంధం ఎలా సాగింది? అనే అంశాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి’ అని చెప్పింది. ఇప్పటివరకు ఈ తరహా క్యారెక్టర్ చేయలేదని రీతూవర్మ ఆనందం వ్యక్తం చేసింది. కెరీర్ విషయంలో బాధపడిన సందర్భాలు ఎప్పుడూ లేవని, మనసుకు నచ్చిన పాత్రలు పోషించాననే సంతృప్తి ఉందని, కొన్ని ఫెయిల్యూర్స్ మినహా నాయికగా తనది విజయవంతమైన ప్రయాణమని రీతూవర్మ చెప్పింది.

- February 20, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor