సినిమా ఇండస్ట్రీలోకి రావడం కంటే IAS, IPS పాస్ అవ్వడం ఈజీ అంటుంది నటి ధన్య బాలకృష్ణన్. సినిమా ఇండ్రస్ట్రీలోకి అమ్మాయిలు రావడంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది నటి ధన్య బాలకృష్ణన్. ఆమె కీలక పాత్రలో వస్తున్న తాజా సినిమా బాపు ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు దయా దర్శకత్వం వహిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు నిర్మాతలు. అయితే ఈ వేడుకలో ధన్య మాట్లాడుతూ.. బాపు అనే సినిమా నా కెరియర్‌లో నేను ఎప్పుడూ నా లైఫ్‌లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉందని చెప్పాడు ఈ సినిమా చేసినందుకు. సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు అనేది దాని ఆత్మ. అందుకు పల్లెటూరు మీద వచ్చే సినిమాలలో ఒక ఆత్మ దాగి ఉంటుంది. అందుకే మా నాన్న చెబుతుండేవాడు. ఎప్పటికీ ఒక పల్లెటూరు కథ చేయమని.. ఇన్ని రోజులకు ఆ కల నేరవేరింది. నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి మానాన్న నన్ను ప్రోత్సహించారు కాబట్టే రాగలిగాను, లేనిచో ఇక్కడ ఉండేదాన్ని కాదు, అంటూ ముగించారు.

- February 19, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor