జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’పై నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి భారీ అంచనాలు వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. కథ విన్న వెంటనే తాను ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పానని, కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో భారీ బడ్జెట్ వెచ్చించినట్లు చెప్పారు. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ పర్ఫెక్ట్‌గా సరిపోయారని, ఈ పాత్ర కోసం ఆయన గంటల కొద్దీ మేకప్‌తో కష్టపడ్డారని వెల్లడించారు. మహేష్ బాబు సినిమా చూసి 24 క్రాఫ్ట్స్ పనితీరును ప్రశంసించారని, ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పడం తమకు మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చిందన్నారు. ఒడిశాలోని ఓ చారిత్రక కోటలో చిత్రీకరణ జరిపిన ఈ చిత్రంలో ఒరిజినల్ లొకేషన్స్, గ్రాండ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. థియేటర్లలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే సినిమా ఇదేనని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
- June 25, 2026
0
5
Less than a minute
You can share this post!
editor

