విమానంలో వెళుతూ న‌వ‌దంప‌తుల స‌ర‌సాలు!

విమానంలో వెళుతూ న‌వ‌దంప‌తుల స‌ర‌సాలు!

సోనాక్షి సిన్హా-జ‌హీర్ ఇక్బాల్ ఇటీవ‌ల ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇరువురు కుటుంబ స‌భ్యుల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా జ‌హీర్‌ని ఎంతో ప్రేమించి సోనాక్షి పెళ్లాడింది. జ‌హీర్ అంటే? త‌న‌కెంత ఇష్టం అన్న‌ది ఇప్ప‌టికే ఎన్నో సంద‌ర్భాల్లో రుజువు చేసింది. వివాహం అనంత‌రం వేరుకాపురం పెట్టాల‌నీ జ‌హీర్ ఇక్బాల్ ప్లాన్ చేసుకున్నా? అందుకు సోనాక్షి ఒప్పుకోలేదు. అత్తింటి కుటుంబంతో ఉమ్మడిగానే కొన్నాళ్ల పాటు క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు సోనాక్షి అత్తింటిలోనే ఉంటోంది. అదే అపార్ట్‌మెంట్‌లో జ‌హీర్ కుటుంబస‌భ్యులు కూడా ఉంటున్నారు. ఇలా ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌కు తానెప్పుడు వ్య‌తిరేకం కాద‌ని సోనాక్షి రుజువు చేసింది. తాజాగా ఈ జోడీ విదేశాలు చెక్కేస్తోన్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఇందులో సోనాక్షి – జ‌హీర్‌ల‌ను గాల్లో ఎగురుతోన్న విమానంలో చూడొచ్చు. సోనాక్షి సీటులో కూర్చుని ముక్కు.. మూతికి మాస్క్ ధ‌రించింది. సీట్‌లో క‌ళ్లు మూసుకుని నిద్ర‌పోతోంది.

ఆ ప‌క్క‌నే జ‌హీర్ ఇక్బాల్ ఉన్నాడు. అత‌డు మాత్రం సోనాక్షిని ప‌డుకోనివ్వ‌డం లేదు. భార్య‌తో స‌ర‌సాలాడుతున్నాడు. సోనాక్షి మాస్క్‌ని పీకేసి స‌ర‌సమాడాడు. దీంతో సోనాక్షి టపీ ట‌పీమ‌ని రెండు దెబ్బ‌లు వేసింది. దీంతో ఇద్ద‌రు కాసేపు స‌ర‌దాగా న‌వ్వుకున్నారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేసి నెట్‌లో ఫ్యాన్స్‌ని న‌వ్వించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ని చెప్ప‌డానికి ఇంత‌కు మించి సాక్ష్యం ఇంకేం కావాలి.

administrator

Related Articles