కాలుతో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్‌.. రాపో 22 ఫస్ట్‌ లుక్‌

కాలుతో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్‌.. రాపో 22 ఫస్ట్‌ లుక్‌

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పి మహేష్‌బాబు  దర్శకత్వంలో రామ్  నటిస్తోన్న తాజా చిత్రం రాపో 22. డబుల్ ఇస్మార్ట్‌ డిజాస్టర్‌ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చేశాడు రామ్ పోతినేని‌. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్న రామ్‌ కంప్లీట్‌ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది. తాజాగా అందరిలో ఒకడు రామ్‌ పాత్రను పరిచయం చేశారు. చేతిలో నోట్‌బుక్ పట్టుకుని కాలుతో సైకిల్ స్టాండ్‌ వేస్తున్న రామ్‌ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్‌ సంగీతం అందిస్తున్నారు. మేరిక్రిస్మస్‌, మలైకొట్టై వాలిబన్‌ ఫేం సినిమాటోగ్రాఫర్‌ మధు నీలకందన్‌ ఈ సినిమాకు పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

editor

Related Articles