ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రిలీజ్‌కి వస్తున్న సినిమా “తండేల్”. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ నెలకొంది. అయితే ఈ సినిమా మేకర్స్ ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి, తెలుగు సినిమా హీరో పవన్ కళ్యాణ్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో తండేల్ సినిమాకి అదనపు ధరలు పర్మిషన్ ఇచ్చినందుకు గాను వారితో పాటుగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కి కూడా గీతా ఆర్ట్స్ సంస్థ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు, అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో నిర్మాణం వహించగా పాన్ ఇండియా భాషల్లో ఈ ఫిబ్రవరి 7న రిలీజ్‌కి రాబోతోంది.

- February 6, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor