హిందీ హీరోయిన్ జాన్వీ కపూర్ తమిళంలో ఒక వెబ్ సిరీస్ చేయబోతోంది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళ దర్శకులలో పా.రంజిత్ ఒకడు. మద్రాస్, కబాలి, కాలా, సర్పాట్ట పరంబరై, తంగలాన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు రంజిత్. ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌తో కలిసి పా.రంజిత్ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వెబ్ సిరీస్‌ను పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమా చేసిన ఈ హీరోయిన్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి ఆర్‌సీ 16 అనే సినిమాలో నటిస్తోంది.

- February 14, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor