లాస్ ఏంజిల్స్ అడవి తగలబడడం వల్ల సంభవించిన నష్టంపై నటి, నిర్మాత ప్రియాంక చోప్రా తన బాధను, వేదనను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి విరాళాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. నటి ప్రియాంక చోప్రా, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వినాశకరమైన లాస్ ఏంజిల్స్ అడవి కాలి, నివాసాలు సైతం అంటుకుపోవడం, ప్రజలు రోడ్డున పడ్డ విషయంపై తన బాధను వ్యక్తం చేసింది. తన గుండె బరువెక్కిందని పేర్కొంటూ, అగ్నిప్రమాదం తర్వాత అవశేషాల కొన్ని ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు. ఆమె క్యాప్షన్‌లో, తన స్నేహితులు, సహోద్యోగులు, తోటి కళాకారులు, ఫిల్మ్ యాక్టర్లు తమ ఇళ్లు, ప్రజలను కోల్పోయారని పేర్కొంది. సమాజాన్ని తిరిగి ఆర్థికంగా కొంచెం పుంజుకునేలా చేసేందుకు కృషి చేస్తున్న కొన్ని సంస్థలకు విరాళాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరుతున్నారు.
- January 16, 2025
0
176
Less than a minute
Tags:
You can share this post!
administrator

