నటి మృణాల్ ఠాకూర్, టీమ్‌ఇండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. ముంబయిలోని ఓ కేఫ్ వద్ద ఇద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. మాకు దొరికిన సమాచారం ప్రకారం.. యశస్వి జైస్వాల్ ముందుగా కేఫ్‌కు వచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మృణాల్ ఠాకూర్ తన స్నేహితులతో కలిసి అదే కేఫ్‌కు చేరుకున్నారు. అయితే వేర్వేరు సమయాల్లో చిత్రీకరించిన ఈ రెండు వీడియోలను కలిపి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఇద్దరూ కలిసి కేఫ్‌కు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇదిలా ఉంటే, మృణాల్ ఠాకూర్‌పై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో నటుడు ధనుష్‌తో పాటు టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారాలన్నింటినీ ఆమె అప్పట్లోనే ఖండించారు. తాజాగా యశస్వి జైస్వాల్‌తో సంబంధించి వైరల్ అవుతున్న వీడియో కూడా తప్పుదోవ పట్టించేలా ఎడిట్ చేసినదేనని స్పష్టత రావడంతో డేటింగ్ వార్తలకు తెరపడింది.

