హీరో ప్రభాస్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. వేసవిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో ప్రభాస్ ఛార్మింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటివరకు చేయని హారర్ కామెడీ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ‘ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త రొమాంటిక్ అవతారంలో మిర్చి సినిమా స్టైల్ మాదిరిలో కనిపిస్తారు. వినోదంతో పాటు కావాల్సినంత యాక్షన్ హంగులుంటాయి. అభిమానులకు ఓ పండగలా దర్శకుడు మారుతి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు’ అని సినిమా బృందం పేర్కొంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: తమన్.

- January 16, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor