‘పెద్ది’ గ్లింప్స్ ట్రీట్ థియేటర్స్‌లో?

‘పెద్ది’ గ్లింప్స్ ట్రీట్ థియేటర్స్‌లో?

ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో రామ్‌చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పెద్ది” కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుండి రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సాలిడ్ రెస్పాన్స్‌ని కూడా అందుకోగా ఆ తర్వాత రామ నవమి కానుకగా మేకర్స్ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ గ్లింప్స్ ఇపుడు థియేటర్స్‌లో కూడా ట్రీట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏప్రిల్ 6న గ్లింప్స్ ఆన్‌లైన్‌లో వచ్చాక 10న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు జాట్ అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో కలిపి పెద్ది గ్లింప్స్ అటాచ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాగా పెద్ది సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

editor

Related Articles