మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా హీరోయిన్‌గా, తర్వాత వెబ్ సిరీసుల్లో నటించింది కానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. నిహారిక ఇటీవలే చిరంజీవి విశ్వంభర సినిమాలోని ఓ పాటలో షూటింగ్‌లో పాల్గొంది. ఈ పాటలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు సినిమా 50 కోట్ల వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో పలకరించబోతోంది. నేడు నిహారిక తన రెండవ సినిమాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్.. పలు సిరీస్ లతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ ఇందులో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడు.

- April 2, 2025
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor