కృతిశెట్టి బాట‌లోనే శ్రీలీల కూడానా..!

కృతిశెట్టి బాట‌లోనే శ్రీలీల కూడానా..!

ఇటీవ‌లి కాలంలో హీరోయిన్స్‌కి ల‌క్ అనేది ఎక్కువ రోజులు కలిసి రావడం లేదు. రెండు మూడు వ‌రుస హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్లు ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ద‌క్కించుకొని కెరీర్ సందిగ్ధంలో ప‌డేలా చేసుకుంటున్నారు. ర‌కుల్‌, త‌మ‌న్నా, పూజాహెగ్డే, కృతి శెట్టి వంటి వారు ఒక‌ప్పుడు ఊపేశారు. కాని ఇప్పుడు వారికి అవ‌కాశాలే క‌రువ‌య్యాయి. ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన కృతిశెట్టి అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే రూట్‌లో శ్రీలీల కూడా వెడుతున్నట్టుగా క‌నిపిస్తోంది. తెలుగులో వరుస హిట్లతో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న శ్రీలీల బిజీ హీరోయిన్‌గా మారింది. అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తూ ఉన్నా కూడా అవ‌న్నీ కూడా బాక్సాఫీస్ దగ్గ‌ర తేలిపోతున్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్‏ట్రార్డినరీ మ్యాన్ ఇలా శ్రీలీల నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమాతో ఓ హిట్ పడింది. కానీ ఈ సినిమా శ్రీలీలకు అంత ప్ల‌స్ కాలేదు. పుష్ప 2లో కిస్సిక్ పాట‌తో కాస్త అల‌రించింది. ఇక ఇటీవ‌ల నితిన్ హీరోగా తెర‌కెక్కిన రాబిన్ హుడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ప్లాప్ అని కొందరు అంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో శ్రీలీల‌కి హిట్ అనేదే ప‌డ‌లేదు.

editor

Related Articles