ఉప-ముఖ్యమంత్రి పవన్ పవన్‌కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ ముంగళవారం సింగపూర్ వెళ్లనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం కురిడిలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమవుతారు. కాగా, మరో మూడు రోజులపాటు విశాఖ జిల్లాలోనే ఉండనున్నట్లు పవన్‌కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రకటించారు. బుధవారం సాయంత్రం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. అయితే కుమారుడికి ప్రమాదం జరగడంతో ఆయన అల్లూరి జిల్లా పర్యటన అనంతరం సింగపూర్ బయలుదేరి వెళతారు.

- April 8, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor