ఈ మధ్య సీనియర్ హీరోలకి సరైన హీరోయిన్ దొరకడం లేదు. ఈ క్రమంలో కొన్నిసార్లు యంగ్ హీరోయిన్స్‌తో జత కడుతున్నారు. అప్పుడు కొంత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావలసి వస్తోంది. ఆ వయస్సులో యంగ్ హీరోయిన్స్‌తో రొమాంటిక్ ఏంటని తిట్టిపోస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం సినిమాలో నటిస్తుండగా, ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు మాళవిక మోహనన్ తెలియజేస్తూ మాళవిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై కొందరు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. “65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణమా? ఈ ముసలి హీరోలు వారి వయసుకు తగిన పాత్రలు కాకుండా ఇలాంటి వాటిపై ఎందుకు ఆసక్తి చూపిస్తారో అని అర్ధం వచ్చేలా కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్‌పై మాళవిక మోహనన్ సీరియస్‌గా రెస్పాండ్ అయింది. సినిమాలో అతను నన్ను ప్రేమిస్తాడు అని నీకెవరైన చెప్పారా, నువ్వే ఏవో కథలు అల్లేసుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నావ్.. నువ్వు ఏదో ఊహించుకుని అవతలి వారిని నిందిస్తున్నావు అంటూ ఘాటుగానే బదులిచ్చింది మాళవిక.

- April 8, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor