‘జాక్’ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్

‘జాక్’ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్

బేబి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణ‌వి చైత‌న్య‌.. మొద‌ట్లో ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్ ఫిలింతో పాపులారిటీ దక్కించుకుంది. యూట్యూబ్‌లో ఇది సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి సినిమా అవ‌కాశాలు వచ్చాయి. తొలుత సైడ్ క్యారెక్టర్లలో నటించిన వైష్ణవి చైతన్య, ఆ తర్వాత 2018లో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అల వైకుంఠపురములో, వరుడు కావలెను, టక్ జగదీష్, ‘వలిమై, ‘ప్రేమదేశం వంటి సినిమాల్లో నటించింది. బేబీ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ సినిమా త‌ర్వాత వైష్ణ‌వి చైత‌న్య‌కి తెలుగులో వరుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ చిత్రంలో ఛాన్స్ ద‌క్కించుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలకానుంది. గ‌త కొద్దిరోజులుగా సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు.

editor

Related Articles