బాలీవుడ్ హీరోగా విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్‌లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ సినిమా “ఛావా” గురించి యావత్ భారతదేశం మాట్లాడుకుంటోంది. ఈ సినిమా ఛత్రపతి మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకుంటోంది. ఇలా ఇండియా వైడ్‌గా స్ట్రాంగ్ రన్‌ని కొనసాగిస్తున్న ఈ సినిమా నిన్న మంగళవారం కూడా సాలిడ్ రన్‌ని అందుకుంది. ఇలా డే 5, డే 4 కంటే ఎక్కువగా 25.75 కోట్ల అందుకున్నట్టుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొత్తం 5 రోజుల్లో 171.28 కోట్ల నెట్ మార్క్ అందుకుంది. ఇలా ఇండియా వైడ్‌గా ఇప్పుడు 200 కోట్ల మార్క్‌కి చేరువ అవుతోంది. ఇక ఈ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా స్త్రీ 2, ముంజ్యా సినిమాల వారు నిర్మించారు.

- February 19, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor