తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లు గుజరాత్‌లో చేపలు పట్టడానికి వెళ్లి అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు చిక్కుతారు. అయితే వీరిని భారత ప్రభుత్వం ఎలా బయటకు తీసుకువచ్చిందనే కథతో ఈ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా చైతూ కెరీర్‌లో 24వ సినిమాగా తెరకెక్కుతుండగా.. తన 25వ సినిమా కోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలిసిన దర్శకులను కాకుండా ఈసారి కిషోర్ అనే కొత్త దర్శకుడితో తన 25వ సినిమా చైతూ చేయబోతున్నాడని టాక్. కిషోర్ చెప్పిన కథ చైతన్యకి బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

- April 2, 2025
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor