2023లో వచ్చిన వివాదాస్పదమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’కి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకుంది. అయితే ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కేరళ పరువు తీసేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే స్పష్టమైన ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సినిమాకు అవార్డులు ఇవ్వడం ద్వారా, సంఘ్ పరివార్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) భావజాలానికి కేంద్రం చట్టబద్ధత ఇస్తోందని విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేశాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా సామరస్యం, ప్రతిఘటనకు ఎప్పుడూ నిలయంగా ఉన్న కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించింది. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ సత్యాన్ని, మనం ఎంతో ఆదరించే రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి తమ గళాన్ని వినిపించాలి అని విజయన్ పిలుపునిచ్చారు.

- August 2, 2025
0
51
Less than a minute
Tags:
You can share this post!
editor