కేటీఆర్‌పై మరోసారి విరుచుకుపడిన కొండా సురేఖ

కేటీఆర్‌పై మరోసారి విరుచుకుపడిన కొండా సురేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై మరోసారి తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మంచి ఆలోచనతో ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే.. ప్రజలు ఊరుకోరు. కేసీఆర్‌ను పక్కనపెట్టి సీఎంలా కేటీఆర్ వ్యవహరించారాని కొండా సురేఖ ఆరోపించారు. కేటీఆర్‌ ఎన్నో కుంభకోణాలు చేశారని మరో బాంబు పేల్చారు. పనికిమాలిన పనులు చేసి BRSకు చెడ్డపేరు తెచ్చారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు. పదేళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడంలేదు అని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

administrator

Related Articles