సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు టాలీవుడ్ హీరో నాని. ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిలో ఒకటి హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాని కొత్త లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వైట్ బ్లేజర్‌లో సాల్ట్ పెప్పర్ లాంగ్ హెయిర్ లుక్‌లో కనిపిస్తున్న లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాని హిట్ 3 కశ్మీర్ షెడ్యూల్ కోసం ఇలా మారిపోయాడని ఇన్‌సైడ్ టాక్. తాజా లుక్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచేస్తోంది. హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ ది ప్యారడైజ్ టైటిల్‌తో రాబోతున్న చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నాని హై ఎనర్జిటిక్ యాక్షన్ ప్యాక్‌డ్ రోల్‌లో కనిపించబోతున్నాడని పరిశ్రమలో టాక్.

- December 16, 2024
0
42
Less than a minute
You can share this post!
editor