లైలాగా విశ్వక్‌సేన్ సినిమా ఫిబ్రవరి 14..

లైలాగా విశ్వక్‌సేన్ సినిమా ఫిబ్రవరి 14..

టాలీవుడ్ యాక్టర్‌ విశ్వక్‌సేన్  వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి VS12. లైలా టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాకి రామ్ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ లేడీ గెటప్‌లో కనిపించబోతుండగా.. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. స్టైలిష్ గాగుల్స్‌లో డ్యుయల్ ప్యాంట్‌తో ట్రెండీగా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఇప్పటివరకు మాస్‌ రోల్స్‌లో అలరించిన విశ్వక్‌సేన్ ఈ సారి లేడీ గేటప్‌లో ఎలాంటి వినోదం అందించబోతున్నాడన్నది సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమాని వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. లైలా తొలి గులాబి న్యూఇయర్ 2025కు రాబోతోంది. ఈ వాలెంటైన్స్ డేకు ఎంటర్‌టైనింగ్ బ్లాస్ట్‌ ఉండబోతుందంటున్నారు. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ ఫిమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీకి తనిష్క్‌ బాగ్చి మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

editor

Related Articles