చిరంజీవి సినిమాపై హైప్ పెంచిన నాని..

చిరంజీవి సినిమాపై హైప్ పెంచిన నాని..

 నాని ఇప్పుడు హీరోగా క‌న్నా నిర్మాత‌గానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. కార‌ణం ఆయ‌న చేసే ప్ర‌తి సినిమా కూడా సూప‌ర్ హిట్ అవుతోంది. రీసెంట్‌గా కోర్ట్  సినిమాతో పెద్ద విజ‌యం సాధించారు. నాని అంటే మంచి సినిమాలు చేస్తాడు, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కూడా ఫిక్స్ అయ్యారు. ప్ర‌స్తుతం నాని శైలేష్ కొల‌ను ద‌ర్శ‌కత్వంలో సొంత బ్యాన‌ర్‌లో హిట్ 3 సినిమా చేస్తున్నాడు. అలానే ది ప్యార‌డైజ్ అనే సినిమాలోను న‌టిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నాని త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించాడు. త్వ‌ర‌లో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ ప్రాజెక్ట్ చేయ‌నుండగా, దీనికి నాని స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకు కారణం ఈసారి మళ్లీ రక్తం పారాల్సిందే అంటూ శ్రీకాంత్ చాలా వయెలెంట్ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీని గురించి తాజా ఇంట‌ర్వ్యూలో నాని మాట్లాడుతూ.. చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేశాం.. కానీ ఆయన అంతకు మించి.. చిరంజీవి కేవలం అది మాత్రమే కాదు.. ఆయన్ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా అందరూ భావిస్తారు..

editor

Related Articles