హిట్టు ప్లాప్‌లను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ నటుడు శర్వానంద్. గతేడాది మనమే అంటూ సినిమా వచ్చింది, దానితో విజయాన్ని అందుకున్నాడు. ఈ నటుడు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ శర్వా 37. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఒకరు సంయుక్త, మరొకరు సాక్షి వైద్య. ఇప్పటికే ఈ సినిమా నుండి శర్వానంద్‌తో పాటు సాక్షి వైద్య ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాబడ్డాయి … తాజాగా ఈ సినిమా నుండి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ టైటిల్ లాంచ్ కోసం నందమూరి హీరోతో పాటు కొణిదెల కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అయితే వారెవరు అనేది తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉంది. గతంలో ఇదే పేరుతో బాలయ్య ఓ సినిమా చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

- January 8, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor