‘గేమ్ ఛేంజర్’ నుండి జాత‌ర సాంగ్ ‘కొండ దేవర’ రిలీజ్..!

‘గేమ్ ఛేంజర్’ నుండి జాత‌ర సాంగ్ ‘కొండ దేవర’ రిలీజ్..!

హీరో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా గేమ్ ఛేంజ‌ర్. ఈ సినిమా 10వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ సినిమా వ‌స్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దిగ్గజ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా నుండి ట్రైల‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి జాత‌ర సాంగ్ కొండ దేవర పాట‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ‘నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర’ అంటూ సాగే పవర్‌ ఫుల్‌ లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్‌ అందించగా.. తమన్‌, శ్రావణ భార్గవి ఈ గీతాన్ని పాడారు.

editor

Related Articles