బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.లక్ష విలువైన డైమండ్ నెక్లెస్ సహా నగదును దోచుకున్నారు. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు 37 ఏళ్ల సమీర్ అన్సారీగా గుర్తించారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న పాత హీరోయిన్ ఇంటికి డిసెంబర్ 28 నుండి జనవరి 5 మధ్య పెయింటింగ్ చేశారు. ఆ సమయంలోనే విలువైన ఆభరణాలు, నగదు దొంగిలించబడ్డాయి. ఫ్లాట్‌కు రంగులు వేసేందుకు వచ్చిన బృందంలో సమీర్ అన్సారీ కూడా ఉన్నాడు. ఒకరోజు ఇంటి అల్మారాను తెరిచి ఉండడం గమనించిన అన్సారీ.. అదే అదనుగా చేసుకుని చోరీకి పాల్పడ్డాడు. రూ.లక్ష విలువైన డైమండ్ నెక్లెస్, రూ.35 వేల నగదుతో సహా కొన్ని విలువైన వస్తువులను అపహరించుకుపోయాడు. చోరీ అంశంపై నటి పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. దొంగిలించింది సమీర్ అన్సారీగా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- January 8, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor