టాలీవుడ్‌లో తమ అభిమాన హీరోను సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధం. ఇక తమ హీరోను ఎవరైనా కామెంట్ చేస్తే, అవతల ఏ హీరో ఉన్నా అతడిపై నిప్పులు చెరుగుతారు. అయితే, టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడారు. గతంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో నాని, విజయ్ కలిసి ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో నటించారు. అయితే, ఆ సమయంలో నాని, విజయ్‌ల మధ్య మంచి స్నేహం ఉందని.. ఒకరికొకరు ఎలాంటి హెల్ప్ అయినా చేసుకునేవారు అంటూ నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక ఇటీవల ‘ఎవడే సుబ్రమణ్యం’ రీ-యూనియన్‌లో ఈ ఇద్దరు హీరోలు కలిసి పాల్గొన్నారు. దీంతో వీరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ఫ్యాన్స్‌కు అర్థమైందని ఆయన తెలిపారు.

- March 19, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor