ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి భారీ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాని అభిమానులు మొదటి నుండి మహేష్ 29వ సినిమా అనే ట్యాగ్‌తో పిలుచుకుంటున్నారు. అయితే ఇది కాస్తా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు (SSRMB) అనే కొత్త ట్యాగ్‌గా తర్వాత వచ్చింది. కానీ దానిని మహేష్ అభిమానులు చాలా వరకు యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి ఇతర న్యూట్రల్స్ నడుమ అలా కాంట్రవర్సీ నడిచింది కానీ ఫైనల్‌గా దీనికి జక్కన్న చెక్ పెట్టేసారు. లేటెస్ట్‌గా విడుదల చేసిన ఒక లెటర్ పీస్ వైరల్‌గా మారింది. అందులో తన సినిమా SSMB29 అంటూనే ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీనితో తన సైడ్ నుండే ఒక క్లారిటీ రావడంతో ఇక నుండి ఇదే కొనసాగనుంది అని చెప్పవచ్చు.

- March 19, 2025
0
20
Less than a minute
Tags:
You can share this post!
editor