నా పదిహేనేళ్ల ప్రయాణం ఓ పాఠం.. ఆ పాఠం నుండి పోరాటం నేర్చుకున్నా అంటున్నారు హీరోయిన్ సమంత. తన కెరీర్ పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గడచిన కాలం గురించీ, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల గురించి సోషల్ మీడియాలో స్పందించారు సమంత. ‘అపజయాలు ఎదురైనప్పుడు కెరీర్‌ను సవాలుగా తీసుకోవడం మామూలే. కానీ నేను విజయాలను సవాలుగా తీసుకుంటా. ఓ విజయం దక్కితే.. దాన్ని మించిన విజయం కోసం శ్రమిస్తా. అదే నా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం’ అని తెలిపారు సమంత. ‘ఇక నుండి కొత్త సమంతను చూస్తారు. నా ప్రయాణంలో అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడే దాకా వెనుకంజ వేయను. నా ప్రయాణం భావితరాలకు పాఠం కావాలి. ఓ స్త్రీగా నాకంటూ చరిత్రలో కొన్ని పేజీలుండాలి.. అదే నా లక్ష్యం. దానికోసం ఇకనుండి నా పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.’ అంటూ పేర్కొన్నారు సమంత. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ చూసినవారంతా.. సమంతలో ఓ పొలిటికల్ లీడర్‌ని చూస్తున్నారు.

- March 10, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor