చిరంజీవి నుండి ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల..

చిరంజీవి నుండి ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల..

ఈ స్టిల్‌ చూసినవారంతా.. మెగాస్టార్‌ ‘విశ్వంభర’లో శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నదా? అనే డౌట్‌ రాక మానదు. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతోంది. అదే స్టూడియోలో మరో షూటింగ్‌లో ఉన్న శ్రీలీలకు.. పక్క సెట్‌లో మెగాస్టార్‌ ఉన్నారని తెలిసింది. అంతే.. ఆనందం ఆపుకోలేక ‘విశ్వంభర’ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది శ్రీలీల. చిరంజీవిని కలిసి పాద నమస్కారం చేసేసింది. మహిళా దినోత్సవం రోజున అనుకోకుండా వచ్చిన ఈ అతిథిని మెగాస్టార్‌ గౌరవంగా శాలువా కప్పి సత్కరించారు. అంతేకాక దుర్గాదేవి రూపం ముద్రించిన ఓ శంఖాన్ని కూడా బహూకరించారు. మెగాస్టార్‌ నుండి ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీలీల.. ఆనందం వ్యక్తం చేస్తూ.. చిరంజీవితో ఉన్న ఫొటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు.

editor

Related Articles