పెళ్లి కాకముందే బెస్ట్ కపుల్స్ అనిపించుకున్నారు తమన్నా, విజయ్‌వర్మ. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా ఇద్దరూ విడిపోయారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ విషయాన్ని వారు మాత్రం ధృవీకరించలేదు. అయితే.. ఇటీవలే ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తమన్నా మాట్లాడిన మాటలు.. వారి బ్రేకప్‌కు బలాన్నిస్తున్నాయి. ‘ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి. కట్టడి ఉండకూడదు. ప్రేమలో ఎమోషన్స్ ఉండాలి. అంచనాలు ఉండకూడదు. అలా వుంటే అది ప్రేమకాదు. వ్యాపారం అవుతుంది. ఎప్పుడైతే ప్రేమ వ్యాపారంలా మారుతుందో.. అప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడం బెటర్.’ అంటూ స్పందించింది తమన్నా.
- March 10, 2025
0
252
Less than a minute
Tags:
You can share this post!
administrator

