హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండియాలోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ముఫాసా అనే రాజు పాత్రకు మహేష్‌బాబు డబ్బింగ్ చెప్పగా.. బాలీవుడ్ హిందీ వెర్షన్‌కి షారుఖ్‌ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్రకు షారుఖ్ కొడుకు ఆర్యన్‌ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 26 నుండి తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.

- March 12, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor