దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్‌బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో పాటు మహేష్‌బాబు – రాజమౌళి కాంబోలో ఫస్ట్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిషాలో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాపై తాజాగా స్పందించింది ఒడిషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా. ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, ఇది స్థానిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని సినిమా షూటింగ్‌లకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చుతుందని సూచించారు. గతంలో మల్కాన్‌గిరిలో పుష్ప-2 షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం SSMB 29 కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది.

- March 12, 2025
0
47
Less than a minute
Tags:
You can share this post!
editor