అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్

అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్

హీరో అమితాబ్ బచ్చన్ మ‌రోసారి అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. గ‌తేడాది రామ మందిర నిర్మాణంతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రూ.14.5 కోట్లు పెట్టి అయోధ్యలో ఓ ప్లాట్‌ను 2024లో కొనుగోలు చేశాడు. ఇదిలావుంటే.. తాజాగా అమితాబ్‌ అయోధ్యలో మ‌రోసారి భూమిని కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్‌కి చెందిన హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్ ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి రామ మందిరం నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ట్లు స‌మాచారం. కొత్తగా కొన్న ల్యాండ్ దాదాపు 54,454 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న‌ట్లు స‌మాచారం. దీని విలువ రూ.4.54 కోట్లు అని తెలుస్తోంది.

editor

Related Articles