టాలీవుడ్‌లో మళ్లీ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గత శుక్రవారం రీ రిలీజైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా థియేటర్‌లో సందడి చేస్తోంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కి సిద్దమవుతోంది. మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘ఢీ’. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించగా.. కోన వెంకట్, గోపి మోహన్ కథను అందించారు. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మంచు విష్ణు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ళ తర్వాత మార్చి 28న రీ రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నాడు మంచు విష్ణు.