బాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో సికందర్ ఒకటి. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎఆర్ మురుగదాస్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ఈ సినిమాలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుండి టీజర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా రీమేక్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై మురుగదాస్ క్లారిటీ ఇచ్చాడు. సికందర్ సినిమా రీమేక్ కాదు. ఇది పూర్తిగా ఒరిజినల్ కథ. సికందర్ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్ చాలా ప్రత్యేకంగా రూపొందించబడింది. దీనివలన ఈ సినిమా చాలా కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఈ సినిమా ఒరిజినాలిటీలో ఒక ముఖ్యమైన భాగం దాని అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. అతని సంగీతం ఈ సినిమాకు సంపూర్ణంగా సరిపోతుంది. ప్రతి సన్నివేశాన్ని మెరుగుపరిచే భావోద్వేగ లోతును జోడిస్తుందని మురుగదాస్ తెలిపారు.

- March 9, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor