‘విశ్వంభర’ VFX పనులు పూర్తి

‘విశ్వంభర’ VFX పనులు పూర్తి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’పై తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొదట ఈ సినిమాను జనవరి 2025లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కొత్త రిలీజ్ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం, సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు పూర్తయ్యాయి. ఇటీవల చిత్రబృందం మొత్తం విజువల్స్‌ను వీక్షించగా, చిరంజీవి కూడా వాటిని చూసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజువల్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహా వినోదం, ‘హిట్లర్’ చిత్రంలోని భావోద్వేగాలు కలగలిపి కథను రూపొందించినట్లు సమాచారం. సృష్టి, స్థితి, లయ అనే అంశాల నేపథ్యంలో కథ సాగనుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles