‘బ్లడీ రోమియో’ ఇంటర్వెల్ ఫైట్ హైలైట్

‘బ్లడీ రోమియో’ ఇంటర్వెల్ ఫైట్ హైలైట్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్టైలిష్ యాక్షన్ చిత్రం ‘బ్లడీ రోమియో’ ప్రీ -ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం, చిత్రం ఇంటర్వెల్‌లో ఎగురుతున్న విమానంలో సాగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు సుజీత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గ్రాండ్ విజువల్స్‌తో రూపొందనున్న ఈ ఫైట్ సినిమాలో వచ్చే కీలక ట్విస్ట్‌కు దారితీయనుందని, మొత్తం చిత్రంలోనే ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలోని ఎక్కువ భాగం షూటింగ్ లండన్‌లో జరగనుండగా, ఇప్పటికే లొకేషన్లను చిత్రబృందం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles