విజయ్‌తో బాలీవుడ్ బ్యూటీ డాన్స్?

విజయ్‌తో బాలీవుడ్ బ్యూటీ డాన్స్?

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన’ చిత్రంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నర్తించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం లేదు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కీలకంగా ఉండనుండగా, అందులో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.

దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు లుక్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. భారీ తారాగణం, గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles