బాలీవుడ్ నటి కియారా అద్వానీ అనారోగ్యం కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో చేరినట్లు ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను ఆమె ప్రతినిధి ఖండించారు. కియారా అద్వానీ ఏ ఆసుపత్రిలో చేరలేదని.. ఆమె ఆరోగ్యంగానే ఉందని బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుందని అంతే తప్ప సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఫేక్ అని తెలిపారు. కియారా అద్వానీ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా.. నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 3 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది కియారా. రీసెంట్‌గా ఆరోగ్యం బాలేక గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్‌కి కూడా రాలేదు ఈ హీరోయిన్. ముంబై ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

- January 4, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor